12 నుండి 20 వరకు ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్
హైదరాబాద్: ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ ఈ నెల 12 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 14 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏపీ ఉన్నత విద్యామండలి రేపు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.