12 వేల టన్నుల ఎరువులు అవసరం

కమిషనర్‌ను కోరిన జేడీ మురళీకృష్టారావు
శ్రీకాకుళం, ఆగస్టు 2 : జిల్లాకు 12 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎస్‌.మురళీకృష్ణారావు కమిషనర్‌ను కోరారు. జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులతో కమిషనర్‌ వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా, 7 వేల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అవసరమవుతాయని తెలిపారు. కమిషనర్‌ ఎం.మధుసూధనరావు మాట్లాడుతూ ఎరువులు పర్యవేక్షించాల్సిన బాధ్యత జె.డి.లదేనని అన్నారు. ఎరువుల నిల్వల సమాచారం ఎస్‌.ఎం.ఎస్‌ల ద్వారా పంపాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో వ్యవసాయధికారి హరి, ఎం.రవికిరణ్‌ ఎస్‌.బి.ఎస్‌.నందు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు