సంక్షేమ హాస్టళ్ళల్లో మెస్‌చార్జీలు పెంచాలి

గోదావరిఖని టౌన్‌ , జులై 21, (జనంసాక్షి):సంక్షేమ హాస్టళ్ళల్లో విద్యార్థులకు మెస్‌, కాస్మోటిక్‌ ఛార్జీలను పెంచాలని… భారత విద్యార్థి ఫెడరేష న్‌(ఎస్‌ఎఫ్‌ఐ) రామగుండం డివిజన్‌ కార్యదర్శి పాసిగంటి రాజు శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యాప్రైవేటీకీకరణను వ్యతిరేకించాలన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలతో… పేద విద్యార్థులకు విద్య దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నిర్లక్ష్యం చేయకుండా మెస్‌ఛార్జీలను పెంచాలని ఆయన కోరారు.