13న టీఎస్‌జేఏసీ ఛలో అసెంబ్లీ

హైదరాబాద్‌, (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ స్టూడెంట్‌ జేఏసీ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జూన్‌ 13న నిర్వహించనున్నట్లు జేఏసీ ఛైర్మన్‌ పిడమర్తి రవి, ప్రధాన కార్యదర్శి సంతోష్‌ ముదిరాజ్‌ ఒక ప్రకటన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు వచ్చే నెలలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. వచ్చే నెల 5న బైక్‌ ర్యాలీ, న కాగడాల ప్రదర్శన చేపట్టాలని పిలుపునిచ్చింది.