14 నుంచి భూభారతి షురూ..
` పైలెట్ ప్రాజెక్ట్‌గా మూడు మండలాలు
` ప్రతి మండలంలో అవగాహన సదస్సులు
` ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం
` ప్రజలకు సౌకర్యంగా ఉండేలా పోర్టల్ రూపకల్పన
` ‘ధరణి’ కంటే మరింత సమర్ధవంతంగా ‘భూభారతి’
` అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
హైదరాబాద్(జనంసాక్షి): భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భూ భారతిని సోమవారం ప్రారంభించనున్న నేపథ్యంలో తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భూ భారతి ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని వాటిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూ భారతిపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ప్రజలు, రైతులకు అర్ధమయ్యేలా, సులభమైన భాషలో పోర్టల్ ఉండాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్దప్రకాష్, సీసీఎల్‌ఏ కార్యదర్శి మకరంద్ తదితరులు పాల్గొన్నారు.
అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
` ఇందిరమ్మ కమిటీల అనుమతితోనే లబ్ధిదారుల ఎంపిక
` అర్హుల జాబితాను మండల అధికారుల బృందం తనిఖీ చేయాలి
` ఇందిరమ్మ ఇళ్ల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. గ్రామ స్థాయిలో లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్త వహించాలని.. అర్హులనే ఎంపిక చేయాలని సీఎం అన్నారు. ఇందిరమ్మ కమిటీ తయారు చేసిన జాబితాను మండల అధికారులతో కూడిన (తహశీల్దార్, ఎంపీడీవో, ఇంజినీర్) బృందం క్షేత్ర స్థాయికి వెళ్లి తనిఖీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎవరైనా అనర్హులకు ఇల్లు దక్కినట్లయితే తక్షణమే దానిని ఇందిరమ్మ కమిటీకి తెలియజేసి ఆ స్థానంలో మరో అర్హునికి ఇల్లు మంజూరు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఎవరైనా దందాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు. అనర్హులు ఎవరైనా ఇల్లు దక్కించుకొని నిర్మించుకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం పాటు వారు పొందిన మొత్తాన్ని వసూలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుకు మంజూరైన ఇంటికి అతని సౌలభ్యం ఆధారంగా అదనంగా 50 శాతం మేర నిర్మించుకునే అవకాశం కల్పించాలని సీఎం అన్నారు. లబ్ధిదారుకు ఆర్థికపరమైన ఊరట లభించేందుకుగానూ సిమెంట్, స్టీల్ తక్కువ ధరలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సమీక్షలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్దప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపాలనతో జీవనప్రమాణాల్లో మార్పు
` కాంగ్రెస్ పాలనతో ప్రజల జీవనంలో మార్పు
` ప్రజలకు చేయూతను ఇచ్చేలా పథకాల అమలు
` సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో పాలన మారిన కొద్ది నెలల లోపే, సామాన్య ప్రజల జీవనశైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా ప్రకటించారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా మారడం ప్రజల ప్రభుత్వ విజయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్రంగా ద్రవ్యోల్బణ భారం ఎదుర్కొనాల్సి వచ్చిందని, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకిన సందర్భాలు తరచూ చూశామని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత, సాధారణ ప్రజానీకాన్ని కేంద్రీకరించి అమలు చేస్తున్న విధానాలు తక్షణ ఉపశమనం కలిగించాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపేర్కొన్న పలు కీలక కార్యక్రమాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారి ఆర్థిక భారం తగ్గించడం సాధ్యమైంది. గ్యాస్ సిలిండర్ ధరలు దేశవ్యాప్తంగా పెరుగుతున్న సమయంలో, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వినూత్నంగా నిలిచింది. ఇళ్లకు ఉచితంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ ఇవ్వడం ద్వారా మధ్య తరగతి మరియు పేద కుటుంబాలకు భారం తగ్గింది. ఆరోగ్య సంరక్షణలో అద్భుతమైన పరిష్కారంగా, సామాన్య ప్రజలకు వైద్య ఖర్చులను భరించే అవకాశం. ఇప్పటికే ఉన్న రేషన్ సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచి, అధిక నాణ్యత కలిగిన బియ్యాన్ని ఉచితంగా అందించడం ద్వారా పోషకాహార భద్రతను పెంచారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ టీ-ª`వట్ చివర్లో, ‘ఇది మార్పు..!! ఇది ప్రజల ప్రభుత్వం..!!‘ అంటూ తన ప్రభుత్వ తీరును గర్వంగా ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గ విధంగా చర్యలు తీసుకుంటామని, ఇది సరళమైన హావిూ కాదని – అమలులోనే చూపిస్తున్నామని తెలిపారు.