14 నెలల్లో కాళేశ్వరం పనులు పూర్తి చేయాలి

4

– మంత్రి హరీశ్‌ డెడ్‌లైన్‌

హైదరాబాద్‌,జూన్‌ 20(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళ్శేరం ప్రాజెక్టు పనులకు 14 నెలల్లో పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు రాష్ట్ర నీటిపారుదల మంత్రి టి.హరీష్‌ రావు సెక్రటేరియట్‌ లో కాళేశ్వరంపై సుదీర్ఘంగా చర్చించారు. బి.హెచ్‌.ఇ.ఎల్‌, ట్రాన్స్‌ కో, నీటిపారుదల శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎత్తిపోతల పంపులపై అధికారులతో మంత్రి సవిూక్షించారు. ఈ ప్రాజక్టులో అంతర్భాగమైన పంపుహౌజ్‌ల నిర్మాణం పూర్తి చేయడానికి నిర్ణీత కాలవ్యవధిని ఖరారు చేశారు. ప్యాకేజీ – 6, ప్యాకేజీ – 8 లకు చెందిన పంపు హౌజ్‌ ల నిర్మాణాన్ని 2017 జూలై చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి హరీష్‌ రావు ఆదేశించారు.ఈ సందర్భంగా టెండర్‌ పక్రియలు, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంపు హౌస్‌ల ఏర్పాటు ప్రాంతాల్లో విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఏర్పాటు గురించి బీహెచ్‌ఈఎల్‌ అధికారులకు సూచనలు చేశారు. త్వరితగతిన పనులు చేప్టటేలా చూడాలని అధికారులకు సూచించారు. అధికారులు పనులను సకాలంఓ పూర్తి చేసేలా చూడాలన్నారు. ఎక్కడా అలసత్వం లేకుండా చూడాలన్నారు. ఇదిలావుంటే  వ్యవసాయం-సాగునీటిపారుదల-నీటి నిర్వహణ రంగాల్లో ఇజ్రాయెల్‌ అనుభవాలను అధ్యయనం చేసేందుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యుల బృందం ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నది. ఈ బృందంలో మూడు రాష్టాల్ర సాగునీటిపారుదల శాఖ మంత్రులు, కేంద్ర సాగునీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఎంపీ కల్వకుంట్ల కవితకు చోటు దక్కింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల సాగునీటి మంత్రులు హరీశ్‌ రావు, బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌, గిరీశ్‌ దత్తాత్రేయ మహాజన్‌, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జీత్‌సింగ్‌, కమిషనర్‌ కుష్వీందర్‌ వోరా, ఉమాభారతి ఓఎస్డీలు లోకేష్‌కుమార్‌, నందితా పాఠక్‌లు ఈ బృందంలో ఉంటారు. ఇజ్రాయెల్‌లోని జెరూసలేం, టెల్‌ అవీవ్‌, ఎష్కోల్‌, టిష్లోవెట్‌కిషోన్‌ తదితర ప్రాంతాల్లోని వివిధ నీటి ప్లాంట్లను సందర్శిస్తారు. దశాబ్దం క్రితం తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో ఆ పరిస్థితిని అధిగమించడం కోసం ఆ దేశం అనుసరించిన అధునాతన విధానాలు, వాటి ఫలితాలు, ఆ అనుభవాలనుంచి నేర్చుకున్న పాఠాలు తదితర అంశాలపై ఈ బృందం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఆ దేశ జలవనరుల మంత్రిత్వశాఖ అధికారులతో పాటు ఆ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన వివిధ ప్రైవేటు కంపెనీల ప్రతినిధులతో కూడా ఈ బృందం భేటీ అవుతుంది. నీటి నిర్వహణలో అనుసరిస్తున్న మేలైన విధానాలను అధ్యయనం చేసి వాటిని మన దేశ అవసరాలకు అనుగుణంగా అమలు చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. పర్యటనలో భాగంగా భారత్‌ బృందం ఈ నెల 28వ తేదీన ఉదయం ఇజ్రాయెల్‌ నీటి వనరులు-ఇంధన-మౌలిక సౌకర్యాలపై ఆ దేశ మంత్రి యువాల్‌ స్టీనిట్జ్‌తో భేటీ అవుతుంది. బిహెచ్‌ఇఎల్‌ (భోపాల్‌) జనరల్‌ మేనేజర్‌ నరేనీద్ర కుమార్‌, బిహెచ్‌ఇఎల్‌  ప్రతినిధులు పూర్ణచంద్రరావు , టి.ఎస్‌.రావు ,ట్రాన్స్‌ కో డైరెక్టర్‌  సూర్యప్రకాష్‌, ఇరిగేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎస్‌.కె. జోషి, ఇ.ఎన్‌. సి మురళీధరరావు ఞఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి,  చీఫ్‌ ఇంజనీర్లు ఎన్‌.వెంకటేశ్వర్లు, బి.హరి రామ్‌, ఎస్‌.ఇ. గోవిందరావు,  డిజైన్స్‌ సి .ఇ. నరేందర్‌ రెడ్డి , ఓఎస్డి శ్రీధర్‌ రావు దేశ్‌పాండే తదితరులు  పాల్గొన్నారు.