హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహ, సెబాస్టియన్‌ల ఈనెల 15 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది… మిగతా నిందితులు సెబాస్టియన్, ఉదయసింహలకు.. ఈనెల 15 వరకు రిమాండ్ విధించారు. కస్టడీ సమయంలో తనకు సరైన ఆహారం… మంచినీరు ఇవ్వలేదని రేవంత్ జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. సిట్ ఆఫీస్‌లో సరైన టాయిలెట్లు కూడా లేవని, బెంచ్‌పై పడుకోమన్నారని జడ్జికి వివరించారు. వైద్య పరీక్షలు కూడా తూతూ మంత్రంగా నిర్వహించారని, తన ఆరోగ్య సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. తాను గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్నానని న్యాయమూర్తికి రేవంత్ వివరించారు. మరో వైపు 11న జరిగే తన కుమార్తె నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు అనుమతించాలని రేవంత్ తరపు న్యాయవాదులు రేపు కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈకేసులో మరొక 13 మందిని నిందితులుగా చేర్చినట్లు తెలుస్తోంది.