15 మంది ట్రైనీ ఎస్సైలకు వైద్య పరీక్షలు
హైదరాబాద్ : నగర శివారు బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీ నుంచి సుమారు 15 మంది ట్రైనీ ఎస్సైలు నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో గొంతు నొప్పికి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అకాడమీలో సౌకర్యాలు సరిగాలేక, అశుభ్రత వల్ల గొంతు నొప్పి లాంటి వ్యాధులు వస్తున్నాయని వారు ఆరోపించారు.