గోదావరిఖని, జూలై 31 (జనంసాక్షి) : రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ‘అభివృద్ధి’ అదృశ్యమైంది. పరిపాలనలో కీలకపాత్రలు పోషిస్తున్న ఇరువురు ఎవరికి వా రు.. తమ పంతం నెగ్గిం చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు గందరగో ళాన్ని సృష్టిస్తున్నాయి. ఈ ప్రాంత ప్రజలకు అందా ల్సిన అభివృద్ధి పనులు అటకెక్కాయి. దేశంలోనే పారిశ్రామికంగా అత్యం త ప్రాముఖ్యతను సం తరించుకున్న రామగుం డం కార్మిక క్షేత్రం నోటిఫైడ్‌ ఏరియా స్థాయి నుంచి మున్సిపాల్టీకి చేరింది. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా రామగుండంను కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. అయితే అప్‌గ్రేడ్‌ కు ముందే మున్సిపాల్టీ పాలకవర్గం కాలపరిమితి తీరడంతో ప్రత్యేకాధికారి పాలన కిందకు వచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం రామగుండం కార్పొరేషన్‌కు స్పెషల్‌ ఆఫీసర్‌గా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హన్మం తుల అరుణ్‌కు మార్‌ వ్యవహరిస్తున్నారు. అయితే రామగుండం నియోజక వర్గ శాసనసభ్యులు సోమారపు సత్యనారా యణ ఒక్కరే ఈ ప్రాంతంలో ఏకైక ప్రతినిధిగా పాలన వ్యవహరాల్లో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఎమ్మెల్యే, జేసీల మధ్య నెలకొన్న ‘ప్రచ్ఛన్న’ యుద్ధం ప్రస్తుతం ఇక్కడ చర్చనీయాంశంగా రచ్చకెక్కింది. ఎమ్మెల్యే సూచించిన అభివృద్ధి పనులను జేసీ బేఖాతరు చేస్తున్నారనే ఆరోప ణలు బహిర్గతమవు తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నుంచి రామగుం డం కార్పొరేషన్‌కు మంచినీటిని సర ఫరా చేస్తే అయ్యే అధికవ్యయాన్ని తప్పించ డానికిగా ను ఎన్టీపీసీ రిజ ర్వాయర్‌ ద్వారా మంచినీటిని సరఫరా చేస్తే తక్కు వ వ్యయమవుతుం దనే అభిప్రాయం తో ఎమ్మెల్యే జేసీ నుంచి ప్రభుత్వప రమైన లేఖను కోర డం జరిగింది. ఈ లేఖ ఇవ్వడానికి సంవత్సరకాలంగా జేసీ జాప్యం చేస్తు న్నట్లు తెలుస్తోంది. అలాగే రామగుండం కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ విభాగం లోని 80 మంది పారిశుద్ధ్య సిబ్బందిని తొలగిం చిన జేసీ ఈ తొలగింపుకు ఎమ్మెల్యే ఉత్తరమే కారణమని జేసీ పేర్కొ నడంతో ఈ వివాదాలకు కారణమైనట్లు సమాచారం. స్థానిక ప్రధాన చౌరస్తాలో నిర్మిం చ తలపెట్టిన రోడ్డు వద్దంటూ ఈ నిధులను స్థానిక శారదనగర్‌లో వెచ్చించాలని ఎమ్మెల్యే ఇచ్చిన సూచనను జేసీ బుట్ట దాఖలు చేసి, యథావిదిగా చౌరస్తా రోడ్డు నిర్మాణానికే టెండర్‌ ఇచ్చి నట్లు తెలు స్తుండగా ఈ వివాదం తారస్థాయికి చేరింది. ఇలా అనేక కార్పొరేషన్‌ అభివృద్ధి పనులకు ముడిపడి ఉన్న అనేక విషయాల్లో ఎమ్మెల్యే సూచనను జేసీ ఎందువల్లనో పక్కకు పెడుతున్నట్లు ఎమ్మెల్యే వర్గీయులు భావించారు. అలాగే రామగుండం కార్పొరేషన్‌ ప్రాంతా నికి కిరోసిన్‌, గోధుమల సరఫరాను కూడా జేసీ కావాలనే తక్కువగా పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనారోగ్య పరిస్థితులు అభివృద్ధి పనులను దూరం జాప్యంచేస్తున్నాయి. ఇదిలా ఉండగా నిబంధనలకు కట్టుబడి విధులను, కార్పొరేషన్‌ అభివృద్ధిని నిర్వహిస్తున్నామని జేసీ భావిస్తున్నట్లు సమాచారం. జేసీ పనితీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రికి సైతం ఎమ్మెల్యే ఫిర్యాదు చేయగా, సీఎం పేషికి జేసీ పలు వివరణలు ఇచ్చినట్లు వినికిడి. అధికారపార్టీ ప్రభావానికి లోబడి జేసీ అభివృద్ధి నిరోధకుడిగా ఎమ్మెల్యేకు వ్యతిరే కిగా వ్యవహ రిస్తున్నాడని ఎమ్మెల్యే ఇటీవలనే తీర్థం పుచ్చుకున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆరోపిస్తున్నారు. కాగా, సోమవారం గోదావరిఖనికి వచ్చిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబుకు సభా ముఖంగానే ఎమ్మెల్యే సత్యనారాయణ జేసిపై ఫిర్యాదు సంధించారు. ఈ ప్రాంతానికి స్పెషల్‌ ఆఫీసర్‌ సక్రమంగా రావడం లేదని రమ్మంటే రారని వచ్చిన ప్రజాప్రతినిధిగా తమ సూచనలు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. ఏదిఏమైనా ఎమ్మెల్యే జేసీల మధ్య రగులు తున్న ఈ ‘చిచ్చు’ అధికారపార్టీ, ఉద్యమ పార్టీల నేతల మధ్య కూడా వివాదాన్ని తెచ్చిపెడుతోంది. స్పెషల్‌ ఆఫీసర్‌ అరుణ్‌కుమర్‌ కార్యని ర్వహణలోని కార్పొరేషన్‌ కార్యాలయంలో అధికారుల, ఉద్యోగుల పరిస్థితి కూడా గందరగోళంలో ఉంది. ఎవరి మాట వినాలో వారికి ప్రశ్నార్థకంగా ఉంది. ఈ పరంపరపై కార్పొరేషన్‌ ప్రజలకు సమాధా నం ఎవరు చెబుతారో వేచి చూడాల్సిందే.