16న మంత్రుల కమిటీ మరోసారి సమావేశం

హైదరాబాద్‌: మంత్రి తోట నరసింహం నివాసంలో జరిగిన మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయాలని కమిటీ నిర్ణయించింది. ఈ నెల 15న మంత్రుల కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఈ నెల 16న ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇవ్వనున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు.