16న చలో ఢిల్లీ: తెలంగాణ న్యాయవాదులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఏర్పాటుకు సంబంధించిన సంకేతాలు ఈనెల 15వ తేదీలోపు రాకుంటే 16వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపు ఉంటుందని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ తీర్మానం చేసింది. తెలంగాణ హైకోర్టు ఏర్పాటు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ ఎంపీలు చేస్తున్న కృషికి న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటు విషయంలో బీజేపీ ఎంపీలు కూడా ముందుకు వచ్చి, సహకరించాలని కోరారు. ఈనెల 15వ తేదీలోపు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన సంకేతాలు రావాలని, లేని పక్షంలో ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలు, నిరసనలు తెలుపాలని నిర్ణయించారు. 15 వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాకుంటే 16వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వాలని తీర్మానం చేసినట్టు న్యాయవాదులు జేఏసీ ప్రతినిధి కే.గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ హై కోర్టు ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని న్యాయవాదులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ ఎంపీలు కూడా సహకరించాలని కోరారు.