16ఏళ్ల తర్వాత తల్లి ఒడికి బిడ్డ
జీత్‌బహుద్దూర్‌ను కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన మోడీ
నేపాల్ ఆగస్టు 3 (జనంసాక్షి) : 16ఏళ్ళపాటు తాను పెంచి పోషించిన జీత్‌బహదూర్ మగర్(26)అనే వ్యక్తిని తన కుటుంబీకులకు ప్రధాని నరేంద్రమోడీ అప్పగించారు. ఆదివారం నేపాల్ పర్యటనలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. 16 ఏళ్ల కిందట కుటుంబసభ్యులకు దూరమైన జీత్ బహదూర్ మగర్(26) అనే యువకుడిని మోడీ స్వయంగా సొంతగూటికి చేర్చారు. నిస్సహాయ స్థితిలో ఉన్న జీత్ బహదూర్‌ను చాలా సంవత్సరాల క్రితం తాను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కలుసుకున్నానని, అప్పుడు ఆ చిన్నారికి ఏమీ తెలియదని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భాష కూడా రాని అతడిని చేరదీసి చేయూతనిచ్చారు మోడీ. చదువు సంధ్యలు నేర్పించారు. బహదూర్ కుటుంబసభ్యులు పశ్చిమ నేపాల్‌లోని నవాస్‌పరాసి జిల్లా కవాసోటీ ప్రాంతంలో జీవిస్తున్నట్లు గుర్తించారు. ఈరోజు నేపాల్ వెళ్లిన ప్రధాని తనతోపాటు జీత్‌ను తీసుకెళ్లి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.