డిగ్రీ కోర్సుల ప్రవేశానికి ఈనెల 16వ తేదీ వరకు రిజిస్ట్రార్ :ఏ సుధాకర్
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ డిగ్రీ కోర్సుల ప్రవేశాల గడువు ఈనెల 16వ తేదీ వరకు ఉన్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఏ సుధాకర్ తెలిపారు. 2013-14 డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు రెండు దఫాలుగా నిర్వహించిన పరీక్షా ఫలితాలు వెల్లడించినట్లు తెలిపారు. 2009 నుంచి 2012 వరకు ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు కూడా ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రవేశాలు పొందే అవకాశం కల్పించామన్నారు.