ఐపీఎల్‌ తుది షెడ్యూల్‌ విడుదల.. ఏప్రిల్‌ 16 న తొలి మ్యాచ్‌

ఐపీఎల్‌ తుది షెడ్యూల్‌ విడుదల..
ఏప్రిల్‌ 16 న తొలి మ్యాచ్‌
ముంబయి: ఐపీఎల్‌ 2014 తుది షెడ్యూల్‌ నేడు విడుదల చేశారు. తొలి విడుత ఏప్రిల్‌ 16 నుండి 30వరకు జరిగే మ్యాచ్‌లను యూఏఈలోని షార్జా, అబుదాబి, దుబాయ్‌లోని 3 మైదానాల్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్‌ 16న అబుదాబిలో… కోలకత్త నైట్‌రైడర్స్‌, మరియూ ముంబయి ఇండియన్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. మే 1 నుండి 12 వరకూ జరిగే మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌లో నిర్వహిస్తారు. ఆ తర్వాత నుంచి భారత్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు కొనసాగుతాయి. ఫైనల్‌ మ్యాచ్‌ జూన్‌ 1న జరుగుతుందని అన్నారు.