17న ఎంప్లాయీస్ యూనియన్ ప్రాంతీయ మహాసభలు
అదిలాబాద్‌అర్భన్,జనంసాక్షి : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (రారోరసం) గుర్తింపు సంఘమైన ఎంప్లాయీస్ యూనియన్ ప్రాంతీయ 4వ మహాసభలు ఈ నెల 17న జిల్లాకేంద్రంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్‌లో జరుగుతాయని ఆ సంఘం ప్రాంతీయ కార్యదర్శి వెంకటయ్య ఒకప్రకటనలో తెలిపారు. ఈ మహాసభలకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్ ముఖ్య అతిథిగా, ప్రాంతీయ పరిశీలనాధికారి వి.వెంకటేశ్వర్లు గౌరవ అతిథిగా హాజరవుతారని చెప్పారు. రీజియన్‌లోని కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని సభలను జయప్రదం చేయాలని కోరారు.