ఆగస్టు 17న శాంతి ర్యాలీ: టీజేఎఫ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ నెల 17న హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జర్నలిస్టు ఫోరం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌, టీడీపీదే నని టీజేఎఫ్‌ స్పష్టం చేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు అంశంపై టీ జర్నలిస్టుల ఫోరం రౌండ్‌ భేటీ నిర్వహించింది. రాజ్యంగ స్పూర్తికి విరుద్దంగా నడుస్తున్న మీడియా మేనేజ్‌మెంట్‌ను కలిసి పరిస్థితిని వివరిస్తామన్నారు. ఉద్యమాల పట్ల అన్ని ప్రాంతాల్లో సీఎంకు ఒకే రకంగా వ్యవహరించాలని టీజేఎఫ్‌ సూచించింది.