18 వ రోజుకు చేరుకున్న గీతా కార్మికుల దీక్షలు

కామారెడ్డి జులై 5 (జనంసాక్షి)
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కల్లు గీతా కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షలు గురువారం 18 వ రోజుకు చేరుకున్నాయ. ఈ సంధర్భంగా కల్లు గీతా కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకట్‌గౌడ్‌ దీక్షలను ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ 18రోజులుగా 59 మంది గీతా కార్మికులు నిరాహారదీక్షలు చేస్తున్న ఎక్సైజ్‌ అధికారులు గాని 2 వ సొసైటీ యజమాన్యంగాని స్పందించకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. నిజమైన గీతా కార్మికులకు 2 వ సొసైటీలో సభ్యత్వం కల్పించాలని లేదంటే జరగబోయే పరిణామాలకు యాజమాన్యమే భాద్యత వహించవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇట్టి దీక్షలో గీతా కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి . గోవర్ధన్‌గౌడ్‌, పోషాగౌడ్‌, సాయాగౌడ్‌, నాగరాజ్‌గౌడ్‌,శ్రావణ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.