18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాల -జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

-ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలి

-ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించు కోవాలి

 సంగారెడ్డి బ్యూరో ,  జనం సాక్షి , ఆగస్టు 23  :::ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించి, ఎన్నికలలో ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు.బుధవారం గుమ్మడిదల మండలం అన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రకృతి నివాస్ గేటెడ్ కమ్యూనిటీని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, ఎస్పీ రమణ కుమార్ తో కలిసి సందర్శించారు. గేటెడ్ కమ్యూనిటీలో గల  556 విల్లాల లోనిసుమారు 2 వేల మంది ప్రజలతో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. కమ్యూనిటీ కాలనీవాసులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురితో ఓటరు జాబితాచూసుకున్నారామీకు ఓటు హక్కు ఉందా, జాబితాలో పేరు ఉందా, ఏవైనా తప్పులు ఉన్నాయా, ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా ఉన్నారా? వారు ఓటరు గా నమోదయ్యారా అంటూ కలెక్టర్ ఆరా తీసారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు  నిర్భయంగా,స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించు కోవాలన్నారు. తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి ప్రజాస్వామ్య బద్ధమైన ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని  కోరారు.ఓటు విలువ, ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగంపై వివరిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు కీలకమని, వచ్చే అక్టోబరు ఒకటి నాటికి 18 సంవత్సరములు నిండే ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, ఎవరైనా ఓటు నమోదు చేసుకోని వారు ఉంటే వెంటనే  నమోదు చేసుకోవాలన్నారు.ఫారమ్ 6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు, ఫారమ్ 8 ద్వారా మార్పులు,చేర్పులు  చేసుకోవచ్చుని తెలిపారు.ఓటర్లు ఏవేని కరెక్షన్స్, షిఫ్టింగ్  తదితరాలు ఉన్నట్లయితే, ఓటరు జాబితాలో అప్డేట్ చేసుకోవాలని కలెక్టర్ కోరారు.సంబంధిత కాలనీలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని తహసిల్దార్ కు ఆదేశించారు.అర్హత ఉండి ఓటరు జాబితాలో పేర్లు లేని వారి నుండి వెంటనే ఫారం 6  దరఖాస్తు లు తీసుకోవాలని, అదేవిధంగా కరెక్షన్స్, షిఫ్టింగ్ లకు సంబంధించి ఆయా ఫారాలను తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ రమణ కుమార్, ఆర్డిఓ రవీందర్ రెడ్డి, తహసిల్దార్ గంగాభవాని, ఎంపీడీవో చంద్రశేఖర రావు,బి ఎల్ ఓ మంజుల, వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీధర్, సభ్యులు ప్రకాష్, కాలనీ ప్రజలు, ఓటర్లు పాల్గొన్నారు.