18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నమోదు చేయాలి

సెప్టెంబర్ 19 నాటికి ఓటరు జాబితాలో అభ్యంతరాల స్వీకరణ* 01.10.2023 వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని తహశీల్దార్ మోహన్ రెడ్డి బూత్ స్థాయి అధికారులను, మండల గ్రామ ఐక్య సంఘాలు (వివో ఏ) లను ఆదేశించారు.కమాన్ పూర్ మండల పరిషత్ అభివృద్ది అధికారి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు పెద్దపల్లి ఆదేశాల మేరకు (స్వీప్) ఐకెపి స్వీఫ్ ఐకెపి గ్రామ ఐక్య సంఘల అధ్వర్యంలో ఓటర్ లిస్ట్ మరియు గ్రామాల్లో అక్టోబర్ 1 2023 నాటికి 18 సంవత్సరాలు నిండబోయే పౌరులకు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా కృషి చేయాలని సూచించారు.రాబోయే ఎన్నికలో ఓటర్లు అందరూ తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలి అని, ఓటర్ జాబితా పకడ్బందీగా ఉండేలా చూడాలని, ఓటరు జాబితాలో మరణించిన వ్యక్తుల వివరాలు, గ్రామం వదిలి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారి పేర్లు ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 19 లోపు తెలియజేయాలని, అక్టోబర్ 1 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా ఇంటింటికి తిరిగి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో రాచకొండ లక్ష్మీ రవి,తహశీల్దార్ మోహన్ రెడ్డి, ఎంపీడీవో విజయ్ కుమార్, ఐకెపి ఎపిఎం శైలజ శాంతి, ఎంపీ ఓ శేషయ్య సూరి, బూత్ స్థాయి అధికారులు, మండల గ్రామ ఐక్య సంఘాల (వి‌ఓ‌ఏ) లు పాల్గొన్నారు.

తాజావార్తలు