18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి -జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 8 (జనం సాక్షి);18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐ డి ఓ సి కార్యాలయంలో గద్వాల మండలం బిఎల్వోలు, సూపర్వైజర్లతో అవగాహన ఓటర్ నమోదుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఫారం_6 ద్వారా వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. గద్వాల మండల కేంద్రాల లో ఎంతమంది కొత్త ఓటరు గా నమోదు చేసుకున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిఎల్వోలు ,సూపర్వైజర్లు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఫారం 6 ద్వారా ఓటరు గా నమోదుచేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు ఉంటే ఫారం 7 ,8 ద్వారా వాటిని మార్చాలన్నారు. ఎవరైనా ఓటరు మరణిస్తే వారి డెత్ సర్టిఫికెట్ తీసుకొని జాబితా నుండి వారి పేర్లను డిలీట్ చేయాలన్నారు. మండలంలో ఎంతమంది ఓటర్ నమోదు అయ్యారో, ఎంత మందిని తొలగించారో పూర్తిస్థాయిలో నివేదిక ఏరోజుకారోజు పంపాలన్నారు. డూప్లికేట్ ఓటర్లు ఉంటే తొలగించాలన్నారు. డూప్లికేట్ ఓటర్లు లేరని సంతకం చేసి సర్టిఫికెట్ ఇవ్వాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ఇంటి నెంబర్ లేనిచో మార్పించాలని తెలిపారు.ఇప్పటివరకు ఎన్ని ఫామ్స్ వచ్చాయి, ఇంకా ఎన్ని రావలసి ఉంది , వచ్చిన వాటిని ఏరోజు కారోజు ఆప్ లోడ్ చేయలన్నారు. ఓటరు కార్డు ఉండి జాబితాలో పేరు లేని వారు, మరణించిన వారి పేరు తొలగింపు, చిరునామా మార్పు, అలాగే అక్టోబర్ 01, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఈ నెల 19 లోగా సంబంధిత ఫారాలను జతపరిచి పోలింగ్ కేంద్రాలు, తహసీల్దార్ల కార్యాలయాలలో సమర్పించాలని కోరారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్బంగా తెలిపారు.ఈ సమావేశం లో ఆర్డిఓ చంద్రకళ ,ఎమ్మార్వో నరేందర్, డిప్యూటీ తాసిల్దార్ విజయ్, ఆర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి బిఎల్వోలు, సూపర్వైజర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు