18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావాలి.

 డిసెంబర్ 8 వరకు కొత్త ఓటర్ల నమోదు, మార్పులు సవరణలకు అవకాశం
— డిసెంబర్ 3, 4 తేదీలలో ప్రత్యేక నమోదు కార్యక్రమాలు
— నూతన ఓటరు నమోదుకు… ఫారం -6
— ఓటర్ కార్డ్ కు ఆధార్ లింక్ .. ఫారం -6 బి.
— 17 సంవత్సరాలు పైబడిన వారు ముందస్తు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం
–.జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి ప్రతినిధి నవంబర్ 29:(జనం సాక్షి):
 జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటర్ గా తమ పేరును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్  పిలుపు నిచ్చారు.
 17 సంవత్సరాలు పైబడిన వారు ముందస్తు నమోదు చేసుకోవాలని మంగళవారం నాడోక ప్రకటనలో సూచించారు.
జనవరి1,2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని  ఓటరుగా నమోదు చేయడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.
 ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వారిగా అర్హులైన  ఓటర్లను గుర్తించాలని, 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులను, దివ్యాంగులను, ట్రాన్స్జెండర్ లను, సెక్స్ వర్కర్లను ఓటర్లుగా నమోదు చేయాలన్నారు.
  కొత్తగా ఓటరు నమోదు కు ఫారం -6 లో, ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానానికి ఫారం – 6(బి)లో, ప్రస్తుతం ఉన్న ఓటర్ జాబితాలో ప్రతిపాదిత పేరును చేర్చడం, తొలగించడానికి, అభ్యంతరాలకు సంబంధించి
ఫారం – 7 లో,   ఓటర్ జాబితాలో నివాస మార్పు, నమోదుల సవరణ, పిడబ్ల్యూడి గుర్తింపు కోసం ఓటరు దరఖాస్తు కు ఫారం -8 లో దరఖాస్తు చేయాలని కలెక్టర్ సూచించారు.
 డిసెంబర్ 3, 4 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం  నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
డిసెంబర్,8 వరకు కొత్త ఓటర్ల నమోదు,మార్పులు, చేర్పులు, సవరణలకు అవకాశముందని తెలిపారు.
అర్హులైన వారందరూ www.nvsp.in/ceo.telangana.nic.in వెబ్ సైట్ లో లేదా ఓటరు హెల్ప్ లైన్ ఆఫ్ నందు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. సమీప
బిఎల్ఓ వద్ద కూడా నేరుగా  దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఓటరు నమోదు, మార్పులు, సవరణలు పూర్తిగా పారదర్శకంగా జరుగుతాయని  తెలిపారు.
ఇట్టి అవకాశాన్ని జిల్లాలో అర్హులైన యువత, విద్యార్థులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు