184 ఇద్దరే కొట్టేశారు..
- చెలరేగిన లిన్, గౌతీ
- పది వికెట్లతో కోల్‌కతా విజయం
- ఐపీఎల్-10లో బోణీ
- చిత్తుగా ఓడిన గుజరాత్
గుజరాత్ భారీ స్కోరు సాధిస్తేనేం.. బలహీనమైన బౌలింగ్ విభాగం లక్ష్యాన్ని కాపాడలేకపోయింది. క్యాచ్ డ్రాప్‌లు, పేలవ ఫీల్డింగ్‌తో ప్రత్యర్థికి భారీ స్కోరు సమర్పించుకుంటేనేం.. కోల్‌కతాలోని టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఇద్దరే 184 పరుగుల భారీ లక్ష్యాన్ని ఊదేశారు. పేలవ బౌలింగ్‌ను తుత్తునియలు చేసిన క్రిస్ లిన్, గౌతమ్ గంభీర్.. గతేడాది గుజరాత చేతిలో ఎదురైన రెండు పరాభవాలకు బదులు తీర్చుకుంటూ.. ఐపీఎల్-10లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘనమైన బోణీ చేసింది.