1984- 1985 పదో తరగతి బ్యాచ్ బాల్యమిత్రులచే కరాటే మాస్టర్ మన్నాన్ కు సన్మానం.

ప్రపంచస్థాయి అవార్డు రావడంపై హర్షం

వేములవాడ రూరల్, జనంసాక్షి, జూలై 24 :

వేములవాడ ఓకినావాస్పోర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్, సీనియర్ జర్నలిస్టు ఎంఏ మన్నాన్ కు అంతర్జాతీయ గుర్తింపు పొందిన గ్లోబల్ వరల్డ్ రికార్డ్ సంస్థ బ్రూస్ లీ ఆల్ మార్షల్ ఆర్ట్స్-2022 ఇంటర్నేషనల్ అవార్డు రావడం పట్ల 1984-85 పదో తరగతి బ్యాచ్ చెందిన బాల్య మిత్రులు హర్షం వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా వారు ఆయనకు ఆదివారం పుష్పగుచ్చం అందజేసి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాస్టర్ మన్నాన్ జిల్లాలోవేలాదిమందివిద్యార్థులకు ,యువకులకు కరాటేలో ఎన్నో నైపుణ్యాలు నేర్పి శారీరకంగా, మానసికంగా దృఢపరచి ఆత్మ స్థైర్యాన్ని నింపుతున్నారని అన్నారు. ఇలాంటిపురస్కారాలు మరెన్నో మన్నాన్ కు వరించాలని వారు కోరుకున్నారు. అనంతరం బాల్య మిత్రుల కు మన్నాన్ కృతజ్ఞతలుతెలిపారు. ఈ కార్యక్రమంలో భగవంతరావు సిలాపురం శంకర్, బొడిగె శేఖర్ బింగి శ్రీనివాస్ , జగన్నాథ్ చారి రవీందర్ రావు గోపీ రాచకొండ శ్రీనివాస్ కోటగిరి రాజశేఖర్ ప్రభాకర్ రెడ్డి గంగాధర్ మధు పారు వె ల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు