2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో రాజాను తొలిసారిగా ప్రశ్నించిన ఈడీ

న్యూఢిల్లీ : 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో టెలికం శాఖ మాజీ మంత్రి ఎ.రాజాను తొలిసారిగా ఎన్‌ఫక్షర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ (ఈడీ) విచారించింది. ఈ కేసులో హవాల రూపంలో డబ్బు తరలిన ఆంశంపై దర్యాప్తు చేస్తోంది. స్పెక్ట్రమ్‌ కేటాయింపులు, వ్యక్తిగత ఆస్తులు, ఆదాయ వివరాలపై రాజాను ఈడీ ప్రశ్నించింది. విచారణ కోసం ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను తీసుకురావాలని ముందుగానే ఈ డీ రాజాను కోరింది. ఈ మేరకు రాజా తెచ్చిన పత్రాలను దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. స్పెక్ట్రమ్‌ కేటాయింపులో విధానపరమైన నిర్ణయాలపై ప్రశ్నించేందుకు మరోసారి రాజాను అవకాశం ఉందని సంబందిత వర్గాలు చెబుతున్నాయి.