2లక్షలు విలువ చేసే కలప స్వాధినం

మహాముత్తారం: మండలంలోని నిమ్మగూడెం గ్రామం మీదుగా డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను ఈ రోజు తెల్లవారు జామున చింతకాని అటవీశాఖధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని వదిలేసి డ్రైవర్‌ పరారయ్యాడని, వాహనంలో 16టేకు దుంగలున్నాయని, సుమారు వీటి విలువ 2లక్షలుంటుందని కలపతో సహా వాహనాన్ని మహాదేవ్‌పూర్‌ డిపోకు తరలించనున్నట్లు రేంజర్‌ జగదీష్‌ చంద్రారెడ్డి తెలిపారు.