20 ఏళ్ల విదేశీ సైన్యాన్ని తరిమికొట్టాం
` ఎవర్నీ శత్రువులుగా చూడం
` మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వం
` మహిళల అన్ని హక్కులు కల్పిస్తాం
` ప్రభుత్వంలోనూ భాగస్వామ్యాన్ని కల్పిస్తాం
` ఇళ్లల్లో సోదాలు చేయబోం
` తాలిబన్ల తొలి అధికార ప్రకటన
కాబూల్,ఆగస్టు 17(జనంసాక్షి): అఫ్గనిస్తాన్‌ను వశం చేసుకున్న అనంతరం తాలిబన్లు తొలిసారి విూడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ… ‘‘20 ఏళ్ల తర్వాత విదేశీ సైన్యాన్ని తరిమికొట్టాం. అంతర్గతంగా, బయట నుంచి శత్రుత్వం కోరుకోవడంలేదు. మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వం’’ అని పేర్కొన్నారు. తాము అందరినీ క్షమించామని, ఎవరి విూదా ప్రతీకారం ఉండదని తేల్చి చెప్పారు. ప్రజల ఇళ్లలో సోదాలు, దాడులు ఉండవని వెల్లడిరచారు.అదే విధంగా… ‘‘అఫ్గన్‌లో ఇతర దేశీయులకు హాని తలపెట్టబోము. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నవారు వెనక్కి రావాలి. ఇస్లామిక్ చట్టాల ప్రకారం మహిళలకు అన్ని హక్కులు కల్పిస్తాం. ఎలాంటి వివక్ష చూపబోం. వైద్య, ఇతర రంగాలలో వారు పనిచేయవచ్చు. అలాగే విూడియాపై ఎలాంటి ఆంక్షలు విధించం’’ అని ముజాహిద్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు స్థానిక టోలోన్యూస్‌తో మాట్లాడుతూ తాము అవలంబించబోయే వైఖరి గురించి మంగళవారం వెల్లడిరచారు.అలాగే అన్ని విూడియా సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించాలని కోరుకుంటున్నామని ముజాహిద్ తెలిపారు. అయితే విూడియాకు మూడు కీలక సూచనలు చేశారు. ‘‘ఏ ప్రసారమూ ఇస్లామిక్ విలువలకు విరుద్ధంగా ఉండకూడదు. నిష్పక్షపాతంగా ఉండాలి. జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏదీ ప్రసారం చేయకూడదని సూచించారు. ప్రజల జీవనోపాధిలో మెరుగుదలకు కృషిచేస్తాం’’ అని చెప్పారు.అఫ్గాన్ తాలిబన్ల వశమవడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. మళ్లీ చీకటిరోజులు తప్పవని భీతిల్లుతున్నారు. గతంలో తాలిబన్ల అరాచక పాలన ఎరిగిన ప్రజలు దేశం నుంచి పారిపోయేందుకు విమానాశ్రయాలకు పోటెత్తుతున్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్లు క్షమాభిక్ష ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.కాగా.. అఫ్గాన్ ఆక్రమణల్లో తాలిబన్లు ఈ సారి తమ సహజ వైఖరికి విరుద్ధంగా శాంతి మంత్రం జపించారు. ఎక్కడా విధ్వంసానికి తెగబడలేదు. తమ ఆక్రమణతో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎవరికీ హాని తలబెట్టబోమంటూ మరోసారి నిన్న భరోసా ఇచ్చారు. అనుమతి లేకుండా ఎవరి ఇళ్లలోకి ప్రవేశించొద్దంటూ తాము ఫైటర్లను ఆదేశించామని.. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, గౌరవాన్ని పరిరక్షించాల్సిందిగా వారికి సూచనలు జారీ చేశామని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ ట్విటర్ వేదికగా తెలిపారు. అమెరికా నేతృత్వంలోని కూటమి తరఫున పనిచేసినవారిపై తామేవిూ ప్రతీకారం తీర్చుకోబోమని తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ హావిూ ఇచ్చారు. అఫ్గాన్ ప్రజల్లో అనవసరపు భయాందోళనలను రేకెత్తించవద్దని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. యథావిధిగా పనులకు వెళ్లాలని తాలిబన్లు టీవీల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు.