20 లక్షల విలువైన బంగారు నగల చోరి

హైదరాబాద్‌, జనంసాక్షి: బోయిన్‌పల్లి జుపిటర్‌ కాలనీలో మంగళవారం భారీ చోరి జరిగింది. కాలనీలో రెండు నివాసాల్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి రూ. 20 లక్షల విలువైన బంగారు నగలను అసహరించారు. బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.