20 వసంతాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

తొర్రూరు 7 అక్టోబర్ (జనంసాక్షి )
20 ఏండ్ల తరువాత బాల్యమిత్రులు ఒక చోట కలుసు కోవడం చెప్పుకోలేని మధుర అనుభవం. శుక్రవారం స్థానిక కిరాణం మర్చంట్ వెల్ఫేర్ ఫంక్షన్‌ హాల్‌లో స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2000-2001 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గురువులతో పాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆత్మీయంగా పలుకరించుకున్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి, సంజీవరెడ్డి, సోమయ్య తో పాటు పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానంలో గౌరవాన్ని పొందినప్పుడే ఉపాధ్యాయులకు పూర్తి గుర్తింపు లభిస్తుందని, విద్యార్థుల ఉన్నతిని తెలుపుతుంటే చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.గురువులు చూపించిన సన్మార్గంలో నడిచి ప్రస్తుతం ప్రతి విద్యార్థీ వివిధ వృత్తుల్లో,ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతూ ఆనంద జీవితాన్ని గడపడం సంతోషంగా ఉందని అన్నారు.విద్యార్థుల ప్రేమకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. అనంతరం గురువులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు వజినేపల్లి అనిల్ కుమార్,పూర్వ  విద్యార్థులు వినోద్, నరేష్, శ్రీను శ్రీకాంత్, శ్రావణ్, వీరస్వామి, మల్లేష్, రామచందర్, రాంమూర్తి తో పాటు తదితరులు  పాల్గొన్నారు.