20 మంది డీఎస్పీలకు రివర్షన్‌

1

55 మంది సీఐలకు ప్రమోషన్‌

134 సూపర్‌ న్యూమరీ పోస్టులకు హోం శాఖ ఆదేశం

హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) :

డీఎస్పీల పదోన్నత వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ¬ం శాఖలో సూపర్‌ న్యూమరరీ పోస్టులు ఏర్పాటు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 134 డీఎస్పీ సూపర్‌ న్యూమరరీ పోస్టులు ఏర్పాటు చేయాలని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. డీఎస్పీల పదోన్నతుల వివాదం, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల స్థానంలో తాజా పోస్టులను సృష్టించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రమోషన్లు ఇచ్చిన అధికారులను ఈ పోస్టుల్లో నియమించే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 1991లో జరిగిన పదోన్నతుల వ్యవహారం వివాదాస్పదమైంది. పదోన్నతుల్లో తమకు అన్యాయం జరిగిందని 1985, 89 బ్యాచ్‌కు చెందిన పోలీసు అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం అర్హులైన వారందరికీ పదోన్నతులు ఇవ్వాలని ఇటీవలే ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా పదోన్నతులు సంపాదించిన వారికి రివర్షన్‌ ఇచ్చింది. 55 మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇవ్వగా, 20 మంది డీఎస్పీ, ఆపై స్థాయి అధికారులకు రివర్షన్‌ ఇచ్చింది. ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని అంతా భావించారు. అయితే, ప్రమోషన్లు పొందిన వారికి రివర్షన్‌ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. పదోన్నతుల వ్యవహారంపై శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో సమీక్ష సమావేశం జరిగింది. 31 మందికి పదోన్నతులు ఇవ్వాల్సి ఉందని, ఈ మేరకు పలువురికి రివర్షన్‌ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. అందుకు ముఖ్యమంత్రి అంగీకరించలేదు. వివిధ ¬దాల్లో కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న వారికి రివర్షన్‌ ఇవ్వడం వల్ల సిబ్బంది మనోస్థైర్యం దెబ్బ తింటుందన్న కేసీఆర్‌.. వారందరినీ సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టించి భర్తీ చేయాలని ఆదేశించారు. దీంతో ¬ం శాఖలో సూపర్‌ న్యూమరరీ పోస్టులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.