200 ఏళ్ల నాటి దర్గా దగ్థం
శ్రీనగర్‌లో ఆందోళనలు
61మందికి గాయాలు
పవిత్ర అవశేషాలు భద్రం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లోని 200 ఏళ్ల నాటి పురాతన దస్తగిర్ దర్గా సోమవారం అగ్నికి ఆహూతయ్యింది. దర్గాకు నిప్పంటుకున్న వర్త తెలియగానే శ్రీనగర్‌లో ఒక్కసారిగా ఆందోళనలు చెలరేగాయి. ఈ ఘటనల్లోదాదాపు 50 మంది పౌరులు, 11మంది పోలీసులు గాయపడ్డారు. శ్రీనగర్ పాత బస్తీ ఖన్యార్‌లోని సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ దర్గాలో ఉదయం 6.30 గంటలకు మంటలు చెలరేగాయి కొద్ది సేపటికే అవి దర్గా మొత్తానికి వ్యాపించాయి. దర్గాలో ఎక్కువ భాగం చెక్కతో చేసినది కావడంతో మంటలు త్వరగా విస్తరించాయి. దర్గాలో ఉన్న మత ప్రబోధనకుడు గౌన్ ఉల్ అజమ్ పవిత్ర అవశేషాలను సురక్షితంగా బయటకు తెచ్చినట్టు అధికారులు చెప్పారు. మంటలకు కారణం ఇంకా తెలియరాలేదని, ఏదైన విద్రోహ చర్య ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తూ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మంటలు అర్పడంలో అలస్తవం ప్రదర్శిస్తున్నారంటూ అగ్నిమాపక సిబ్బందిపై స్థానికులు రాళ్లు రువ్వారు. అనంతరం సమీపంలోని ఖన్యార్ పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు పలు పర్యాయాలు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ సమాయంలో జరిగిన ఘర్షణలో మొత్తం 61మంది ప్రజలు, పోలీసులు గాయపడ్డారు. మరోవైపు దర్గాపై గౌరవ సూచకంగా, దర్గాను తగిన రక్షణ కల్పించలేకపోయిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా… పలు వేర్పాటు వాద బృందాలు మంగళవారం రాష్ట్రంలో బంద్‌కు పిలుపునిచ్చాయి. దర్గా భవన సముదాయం కాలిపోయిన ఘటనపై కాశ్మీర్ డివిజన్‌లో కమిషనర్ చేత విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దర్గాను పాత అకృతిలోనే వక్ఫ్‌బోర్డు పున:నిరిస్తుందని న్యాయశాఖమంత్రి, స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ సాగర్ తెలిపారు.