200, వందల ఎకరాల సొంత భూమిని పేద ప్రజలకు పంచి పెట్టిన మహనీయుడు రావి నారాయణరెడ్డి

తెలంగాణ సాయుధ పోరాటాన్ని పెను తుపానుల హోరెత్తిచ్చిన విప్లవ వీరుడు రావి
రావి నారాయణరెడ్డి 33వ వర్ధంతి సందర్భంగా సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్లో సిపిఐ కరీంనగర్ నగర సమితి ఆధ్వర్యంలో రావి నారాయణరెడ్డి చిత్రపటానికి *సిపిఐ కరీంనగర్
నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ
తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటానికి సారథ్యం వహించి నిజాం సర్కార్ నీ తుద ముట్టించడానికి ఉప్పెనలా పైకెగసి గుండెను కాగడాగా వెలిగించి రైతాంగ గేరిల్లా సైనికులకు తెలంగాణ వెలుగు దారి చూపించి విజయ డంకా మ్రోగించి పల్లె పల్లెలో రైతాంగ పోరాటాన్ని పెను తుపానులా హోరెత్తించిన విప్లవ వీరుడు రావి నారాయణరెడ్డి, రావి నారాయణరెడ్డి ప్రముఖ స్వాతంత్ర ఉద్యమ నాయకుడు నిజాం పాలన వ్యతిరేక విమోచన ఉద్యమ కారుడు మరియు రాజకీయ నాయకుడు జూన్ 4, 1908న భూస్వామ్య కుటుంబంలో నల్గొండ జిల్లా భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామంలో జన్మించారు, ప్రాథమిక విద్య బొల్లెపల్లి బోనగిరిలో చదివారు ఆ తర్వాత హైదరాబాదులోని రెడ్డి హాస్టల్ లో ఉండి హై స్కూలు పూర్తి చేశారు చాదర్ ఘాట్ హైస్కూలు లో ఎస్సే ఎస్సే ఎల్సీ, నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ అభ్య సించారు విద్యార్థి దశలోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు కాకినాడ వెళ్లి సత్యాగ్రహం లో పాల్గొన్నారు. గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై స్వగ్రామంలో బొల్లెపల్లిలో ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు 1933లో హైదరాబాదులో ఏర్పాటు అయిన హరిజన్ సేవ సంఘానికి కార్యదర్శిగా పనిచేశారు.
తొలినాళ్లలో ఆర్య సమాజ్ ప్రభావానికి లోనైన నూ చివరకు సోవియట్ రష్యా పురోభివృద్ధికి ఆకర్షితుడై కమ్యూనిస్టుగా మారినారు. 1934లో పోచంపల్లిలో సీతాదేవితో వివాహం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఈమె కూడా పాల్గొన్నది 1941లో చిలుకూరు లో జరిగిన ఆంధ్ర మహాసభకు 1944లో భువనగిరి ఆంధ్ర మహాసభకు 1945లో ఖమ్మంలో జరిగిన సమావేశానికి రావి నారాయణరెడ్డి అధ్యక్షతన వహించారని 1944లో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన వహించిన భువనగిరి ఆంధ్ర మహాసభలో అతివాద మితవాద వర్గాల అభిప్రాయ భేదాల కారణంగా రెండుగా చీలిపోయింది కమ్యూనిస్టు ఆధీనంలోకి వచ్చిన దానికి రావి నారాయణరెడ్డి అధ్యక్షతన వహించారు. 1946లో 1951 కాలంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించారు నిజాం నిరంకుశ పాలనకు భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటంలో 4 వేల గ్రామాలకు చెందిన లక్షలాది ప్రజలు పాల్గొన్నారు ఈ పోరాటం ఫలితంగా 10 లక్షల ఎకరాల భూమి పేద రైతులకు దక్కింది 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలలో రావి నారాయణరెడ్డి భువనగిరి నుంచి లోక్ సభకు పోటీ చేసి దేశంలోనే అధికంగా (నెహ్రూ కంటే) మెజారిటీ సాధించారు 1957-1962 లలో భువనగిరి నుంచి శాసనసభకు ఎన్నిక అయ్యారు 1957లో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు రావి నారాయణరెడ్డి 1967 లో స్వచ్ఛందంగా రాజకీయాలనుంచి విరమణ పొందారు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు 100కు పైగా పాఠశాలలు వసతిగృహాలు నిర్మించారు భూమిలేని నిరుపేదలకు తన సొంత భూమి 200 ఎకరాల సొంత భూమిని దానం చేశారు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు బీబీనగర్-నడికుడి మార్గం కోసం పోరాడారు బొల్లెపల్లి పరిధిలోని నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్ కు ఉచితంగా స్థలాన్ని ఇచ్చారు ఈ స్టేషన్ కు రావి నారాయణరెడ్డి రైల్వే స్టేషన్ గా నామకరణం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమలులోకి రాలేదు 1978లో ఆంధ్ర విశ్వ విద్యాలయం నుంచి కళ ప్రపూర్ణ బిరుదును అప్పటి గవర్నర్ శారద ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు 1991 సెప్టెంబర్ 7న మరణించారు మరణానంతరం 1992లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదు ఇలాంటి మహనీయుని ఆశయ సాధనకై ప్రతి ఒక్క కమ్యూనిస్టు కార్యకర్త ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కిన్నెర మల్లమ్మ, కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, బూడిద సదాశివ, కంది రవీందర్ రెడ్డి నగర నాయకులు పరికరాల సాంబయ్య,కిరణ్, వీరగోని హరీష్, k సురేష్ రామ్మూర్తి, ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు