2002 ముంబై పేలుళ్లు : హైదరాబాద్‌లో టెక్కి అరెస్టు
ముంబై ముంబైలో 2002లో జరిగిన పేలుళ్లతో సంబందం ఉందనే అరోపణపై నగరం నేర పరిశోదన విభాగం పోలీసులు హైదరాబాద్‌లో ఓ టిక్కీని అరెస్టు చేశారు. ముంంబైలోని ఘట్కోపార్ స్టేషన్ వద్ద బెస్ట్ బస్‌లో జరిగిన పేలుడులో నలుగురు మరణించారు. తాజాల్ కాజీ (30) అనే టెక్కీ నిజానికి ఔరంగబాద్‌కు చెందినవాడు. వేరే ఐడి వాడుతూ హైదరాబాద్‌లో ఉంటూ అతను హిందుస్తాన్ కంప్యూటర్స్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి అతన్ని అరెస్టు చేశారు. ఓవారం రోజులపాటు అతనిపై నిఘా పెట్టి సీనియర్ ఇన్‌స్పెక్టర్స్ శశాంక్ సాన్‌భోర్, అజయ్ సావంత్ కేంద్ర నిఘా విభాగం పోలీసులు అరెస్టు చేశారు. కాజీ తన పేరును సిద్దిఖి తాజు ఇస్లాం అమీనుద్దీన్‌గా ముర్చుకున్నాడని. ముంబై పేలుళ్లు జరిగిన వెంటనే పోలీసులు గాలిస్తున్న సమయంలో అతను హైదరాబాదుకుపారిపోయిడని పోలీసులు చెప్పారు. కాజీ నిషేదిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ అఫ్ ఇండియా సభ్యడు. 2002 డిసెంబర్ 6వ తేదీన ఘటక్‌పోర్ రైల్వే స్టేషన్ సమీపంలో బెస్ట్ బస్సులో బాంబు పెట్టారు. అది పేలడంలో బస్సుదగ్దమై నలుగురు మృతి చెందగా, 30 మంది దాకా గాయపడ్డారు. ఎనిమిది నెలల కాలంలో జరిగిన ఐదు బాంబు పేలుళ్లలో ఇది మొదటిది.ఈ ఘటనలో పోలీసులు తోమ్మిది. మందిని అరెస్టు చేశారు. ఇమ్రాన్ రెహ్మన్‌ఖాన్, అల్తాఫ్ మొహ్మద్ ఇస్మాయిల్, తోఫిక్ అహ్మద్, అరిఫ్ పాన్వాలా, హరున్ రఫీద్ లోహర్,రఫీద్ అన్సారీలను పోలీసులు అరెస్టు చేశారు. సాక్ష్యాలు లేకపోవడంతో వారికి 2005లో కోర్టు విముక్తి ప్రసాదించింది.