2014 ఎన్నికల బాధ్యత రాహుల్‌ భుజాలపై

 

న్యూఢిల్లీ: నవంబర్‌ 15,(జనంసాక్షి):

పార్టీలో రాహుల్‌గాంధీ కీలక పాత్ర పోషిస్తారనే దానికి సంకేతంగా 2014లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ సమన్వయ కమిటీకి నేతృత్వం వహించే బాధ్యతను రాహుల్‌గాంధీకి కాంగ్రెస్‌పార్టీ గురువారం అప్పగించింది. గాంధీ నేతృత్వం వహించే ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులుగా సీనియర్‌ నేతలు ఆహ్మద్‌పటేల్‌, జనార్ధాన్‌ ద్వివేది, దిగ్విజయ్‌ సింగ్‌, మధుసుధన్‌ మిస్త్రి, జైరాం రమేశ్‌ ఉంటారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌ ద్వివేది ప్రకటించారు. ఎన్నికలకు ముందు పొత్తులపై సీనియర్‌ నేత ఎ.కె.ఆంటోనీ నేతృత్వంలో ఒక ఉప బృందం సహాఅలాంటి కీలకమైన అంశాలపై మరో రెండు ఉప బృందాలను కూడా ఆయన ప్రకటించారు. మ్యానిఫేస్టో, ప్రభుత్వ కార్యక్రమాలపై ఉప బృందానికి సైతం రక్షణశాఖ మంత్రి నేతృత్వం వహిస్తారు. కాగా కమ్యూనికేషన్‌, పబ్లిసిటీ ఉప బృందానికి దిగ్విజయ్‌సింగ్‌ నపేతృత్వం వహిస్తారు. సూరజ్‌కుండ్‌ వద్ద సంవాద్‌ బైఠక్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించినట్టుగా 2014లో జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సమన్వయ కమిటీ, మూడు ఉప బృందాలను ఆమె ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశంలో  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌ ద్వివేది ప్రకటించారు.