2015 కల్లా 4జీ సేవలు

mukesh
మూడేళ్లలో 1.80 లక్షల కోట్ల పెట్టుబడి
రిలయన్స్‌ చీఫ్‌ ముఖేశ్‌ వెల్లడి
ముంబై, జూన్‌ 18 (జనంసాక్షి) :
రాబోయే మూడేళ్లలో 1.80 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. అం దరూ ఎదురు చూస్తున్న 4జీ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను 2015 కల్లా అందులోబాటులోకి తెస్తామని తెలిపింది. విద్యుత్‌ రంగంలో పెట్టుబడులతో దేశాభివృద్ధికి కట్టుబ డి ఉన్నామని వెల్లడించింది. బుధవారం ముంబైలో జరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 40వ వార్షిక సమా వేశంలో ఆ సంస్థ అధినేత ముఖేశ్‌ అంబానీ ప్రసంగిం చారు. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల్లో ఒకరిగా పేరొందిన ఆయన గత 37 ఏళ్లలో సంస్థ సాధించిన విజయాలను, రాబోయే మూడేళ్లలో చేపట్టబోయే భవి ష్యత్‌ కార్యాచరణ
ప్రకటించారు. మూడేళ్లలో రూ.1.80 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. పెట్రోకెమ్‌ ఉత్పత్తులు, విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల విస్తరణ, మరిన్ని రిటైల్‌ సంస్థల స్థాపన, టెలికాం వ్యాపారం విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు. రిలయన్స్‌ టెలికాంకు చెందిన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులను అందుబాటులోకి తేనుందన్నారు. రాబోయే కొన్ని నెలల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తామని చెప్పారు. రిటైల్‌ వ్యాపారాన్ని వృద్ధి చేస్తామని ప్రతి మూడు నాలు గేళ్లకోసారి ఆదాయాన్ని రెట్టింపు చేసుకోనున్నట్లు తెలిపారు. ఆదాయపరంగా రిటైల్‌ రంగంలో రిల యన్స్‌ అగ్రగామిగా ఉందని దేశంలో అతిపెద్ద రిటైలర్‌గా ఎదిగామని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ లో రిలయన్స్‌ అంతర్భాగమైందని తెలిపారు. దేశం ఎగుమతుల్లో రిలయన్స్‌ వాటా 14.7 శాతంగా ఉన్నట్లు చెప్పారు. గతేడాది 68 మిలియన్‌ టన్నుల చమురును శుద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్‌ రంగంలో అత్యధిక పన్ను చెల్లించే సంస్థ రిలయన్స్‌ అని స్పష్టం చేశారు. దేశంలో మొత్తం పరోక్ష పన్ను ల్లో తాము 4.7 శాతం మేర చెల్లిస్తున్నామని వివరించారు. ఫార్చూన్‌ జాబితాలో ప్రపంచంలో లిస్ట్‌ అ యిన 500 కంపెనీల్లో రిలయన్స్‌ ప్రస్తుతం 135 వ ర్యాంక్‌ కలిగి ఉందని రాబోయే రాజుల్లో 50వ ర్యాంక్‌కు చేరాలన్నదే లక్ష్యమన్నారు. గత 37 సంవత్సరాల్లో రూ.2.40 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ముఖేశ్‌ వెల్లడించారు. రాబోయే మూడేళ్లలో మరో రూ.1.89 లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామన్నారు. రాబోయే రెండేళ్లలో పెట్రోకెమికల్స్‌, రిఫైనింగ్‌, రిటైల్‌, టెలికాం రంగాల్లో ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు. 2015-16లో మధ్యప్రదేశ్‌లోని కోల్‌బెడ్‌ మిథేన్‌ బ్లాక్‌లో గ్యాస్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తామని ప్రకటించారు. కేజీ డీ6, సీవై డీ5 బేసిన్ల నుంచి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసు కుంటున్నట్లు చెప్పారు. 2015లో దశల వారీగా రిలయన్స్‌ జియోను ప్రా రంబిస్తామన్నారు. 4జీ బ్రా డ్‌బ్యాండ్‌ కోసం రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వివరించారు. ఈ సమావేశానికి ముఖేశ్‌ తల్లి కోకిల అంబానీ, భార్య నీతా అంబానీ, పిల్లలు హాజరయ్యారు.