2019లో అధికారంలోకి వస్తాం
– ఒంటరి పోరాటం చేస్తాం
– భట్టి విక్రమార్క
ఆదిలాబాద్,జూన్ 20(జనంసాక్షి): దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని బిజెపి ప్రయత్నిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. ముక్త కాంగ్రెస్ పేరుతో బిజెపి చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని అన్నారు. ఆదిలాబాద్‌లో ఆయన మాట్లాడుతూ… ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, దేశం కోసం బిజెపి, మోదీ చేసిన త్యాగాలేవిూ లేవన్నారు. గత రెండేళ్లుగా మోడీ కేవలం విదేశాల్లో తిరుగుతూ కాలయపాన చేస్తూ పాలనను పక్కన పెట్టారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రచారానికి ఇస్తున్న ప్రాధాన్యత సంక్షేమానికి ఇవ్వడం లేదని విమర్శించారు. ఇచ్చిన హావిూలను తుంగలో తొక్కి కేవలం ఇతర పార్టీల వారిని చేర్చుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ లక్ష్యమంటూనే ఎన్నికల హావిూలను విస్మరిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందేనని పిలుపునిచ్చారు. డబుల్ బెడ్‌రూం తదితర పథకాల్లో సీఎం కేసీఆర్ మాయమాటలు చెప్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నా ఇక్కడ ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లును ఒక్కటైనా నిర్మించినా అని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల వరకు పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. సోనియా తెలంగౄణ ఇస్తే కెసిఆర్ కుటుంబం దానిని అనుభవిస్తోందని భట్టి అన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్టాన్న్రి లక్ష కోట్ల అప్పుతో అప్పుల తెలంగాణగా మార్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టి పథకాలను అమలు చేయకుండా సీఎం నియంత పాలన సాగిస్తున్నారని విమర్శించారు.