21 నుంచి పసుపు కొనుగోళ్లు

నిజామాబాద్‌, జనవరి 19 : సంక్రాంతి సెలవుల దృష్ట్యా నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో క్రయవిక్రయాలు నిలిపివేశామని ఆ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నగేష్‌రెడ్డి తెలిపారు. శనివారం కమిషన్‌ ఏజెంట్లు, కొనుగోలు దార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 21 నుండి పసుపు కొనుగోళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఉదయం 9 గంటలలోపు పసుపును విక్రయించేందుకు తీసుకురావాలని రైతులకు సూచించారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటలవరకు మార్కెట్‌ కమిటీ ప్రధాన గేట్లను మూసివేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమయంలో గ్రేడింగ్‌ పద్ధతిన పసుపు తూకం వేయడం జరుగుతుందని అన్నారు. వ్యాపారస్తులు, కమిషన్‌ ఏజెంట్లు గ్రేడింగ్‌ పద్ధతిలోనే పసుపును కోనుగోలు చేయాలని కోరారు. ప్రస్తుతం మార్కెట్‌లో పసుపు క్వింటాల్‌ ధర 5600 రూపాయలు ఉందని, కనీసం 3200 ఉందని చైర్మన్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు, సిబ్బంది ఉన్నారు.

తాజావార్తలు