డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలి

share on facebook

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):డాక్టర్ ప్రీతి నాయక్ ఆత్మహత్యకు కారకులైన నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బూర శకుంతల గౌడ్, ప్రమీల డిమాండ్ చేశారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతినాయక్ కి నివాళులు అర్పిస్తూ కొత్త బస్టాండ్ నుండి ఎంజీ రోడ్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ ప్రీతి నాయక్ మరణం అత్యంత బాధాకరమని అన్నారు.రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు అరికట్టడంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించాలన్నారు.డాక్టర్ ప్రీతి మృతికి కారుకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. డాక్టర్ ప్రీతి కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పల్సా మహాలక్ష్మి ,సలిగంటి సరిత, అసంఘ పట్టణ అధ్యక్షురాలు శ్యామల గౌరి, లలిత, కల్పన, పద్మ, శ్రీలక్ష్మి , నాగరాణి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.