సబ్ స్టేషన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

ఝరాసంగం మార్చి 4( జనం సాక్షి )  సబ్ స్టేషన్ పనులు వేగవంతం చేయాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అన్నారు. శనివారం ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి  గ్రామంలో కొనసాగుతున్న సబ్ స్టేషన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సి డి సి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ తో  కలిసి ఆయన పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను వేగవంతంగా జరిగించాలని పనులు నాణ్యవంతంగా చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్, ఎంపీటీసీ విజేందర్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు అజీజ్ తదితరులు ఉన్నారు.