22 నుంచి 10వ తరగతి పరీక్షలు

హైదరాబాద్‌ : పదవ తరగతి పరీక్షలు ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతాయని ఎస్‌ఎస్‌సీ బోర్డు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇవి ఏప్రిల్‌ 10వ తేదీతో ముగుస్తాయని తెలిపింది. 12.36 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారని పేర్కొంది. 5,646 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పింది. హాల్‌ టిక్కెట్‌ రాని విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. మేలో ఫలితాలు వెల్లడిస్తామని ఎస్‌ఎస్‌సీ బోర్డు పేర్కొంది.