22 నుంచి జాబ్ మేళా
ఆదిలాబాద్, జనవరి 20 (: రాజీవ్ యువకిరణాల్లో భాగంగా జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశం కల్పించేందుకు ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు డిఆర్డీఎ పిడి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని మల్లినేషనల్ ఫార్మ కంపెనీ రెడ్డిస్ ల్యాబ్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఇంటర్, బైపిసి, ఎంపీసీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. ఈ నెల 22న సరస్వతీ జూనియర్ కళాశాల నిర్మల్ రోడ్డు భైంసాలో, 23న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్టీఆర్ మినీస్టేడియం నిర్మల్, కాగజ్‌నగర్ ఐకేపీ కార్యాలయంలో, 24న చైతన్య జూనియర్ కళాశాల మంచిర్యాల, ఆదిలాబాద్‌లోని టిటిడిసిలో ఉదయం 10గంటలకు నిర్వహించే జాబ్ మేళాకు ఆసక్తి గల అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు.