22 నుంచి రైతు చైతన్య యాత్రలు
మల్హార్, జనంసాక్షి: మల్హర్ మండలంలో 22నుంచి రైలు చైతన్య యాత్రలను ప్రారంభిస్తున్నట్లు ఇంఛార్జి వ్యవసాయాధికారి సతీష్ తెలిపారు. 22న తాడిచెర్ల, 23న కాపురం, 24న మల్లారం, 25న చిన్నతూండ్ల, 26న పెద్ద తూండ్ల, 27న క్షాత్రాజ్‌పల్లి, 29న దుబ్బపేట, 30న నాచారం, అన్సాన్‌పల్లి గ్రామాలలో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ రైతు సదస్సును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.