23న వైద్యుల పోస్టులకు ఇంటర్వ్యూలు
ఆదిలాబాద్, జనవరి 20 (): జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల భర్తీకి ఈ నెల 23న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తామని అన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్టు, పాస్‌పోర్టు సైజ్‌ఫొటోతో జిల్లా కేంద్రంలోని డిఎంహెచ్‌వో కార్యాలయంలో మధ్యాహ్నం 2గంటలకు హాజరు కావాలని సూచించారు.