23 నుంచి అంగన్‌వాడీలకు శిక్షణ

వినుకొండ, జూలై 10: ఈ నెల 23 నుండి 28వరకు వినుకొండ నియోజకవర్గమైన ఈపూరు, బొల్లాపల్లి మండలాల్లో పని చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు స్థానిక సమస్యలపై ఐదారు రోజులు శిక్షణ నిర్వహిస్తున్నామని సిడిపిఓ స్వరూపారాణి తెలిపారు. 23, 24 తేదీల్లో మండల కేంద్రాల్లో, 25, 26 తేదీల్లో బొల్లాపల్లి సమీపంలో పని చేస్తున్న కార్యకర్తలకు, 27, 28 తేదీల్లో ఈపూరు పరిధిలో పనిచేస్తున్న కార్యకర్తలకు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణను కార్యకర్తలు హాజరు కావాలని ఆమె కోరారు.