23 నుంచి ఆగమ అర్చక శిక్షణ

ఆదిలాబాద్‌, జనవరి 20 (): ఈ నెల 23 నుంచి 27 వరకు నల్గొండ ఆలేరు మండలం కొలనుపాక ఆలయ ప్రాంగణంలో హైదరాబాద్‌ వీరశైవ ఆగమ పరిషత్‌ ఆధ్వర్యంలో అర్చక శిక్షణ శిబిరం  నిర్వహించనున్నట్లు జంగమ సమాజం రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి అన్నదానం జగదీశ్వర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వీరశైవ జంగమలు 9440063140 నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.