23 నుంచి ఒరియెంటేషన్‌ వర్క్‌షాపు

కాకినాడ, జూలై 21 : ఈ నెల 23 నుంచి 25 వరకు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో ఆరోగ్యశ్రీ పథకంపై 3రోజుల పాటు ఓరియెంటేషన్‌ వర్కుషాపు జరుగుతుందని కాకినాడ ఆరోగ్యకశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కెబివిఎస్‌ కేశవప్రసాద్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవ ఉపన్యాసం చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్‌ ఆర్యోగశ్రీ ట్రస్ట్‌ నుంచి 3 రిసోర్సు పర్శన్‌లు ఈ వర్కుషాపులో పాల్గొని శిక్షణ ఇవ్వనున్నారని కేశవ ప్రసాద్‌ తెలియజేశారు.