23 న ‘శ్రీ రంగనాయక’ విడుదల
అన్నమయ్య , శ్రీరామదాసు, మంజునాథ, శిరిడిసాయి , ఓం నమో వెంకటేశాయ.. వంటి అద్భుత భక్తిరస చిత్రాల సరసన మరో సినిమా తెలుగు వెండితెరపైకి రాబోతుంది. నేటి యువతకు శ్రీ మహవిష్ణు మహత్యం తెలియజేసే ఉద్దేశ్యంతో గోవింద రాజ్ విష్ణు ఫిల్మ్స్ బ్యానర్ పై రామావత్ మంగమ్మ నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘శ్రీ రంగనాయక’. దుందిగల్ వినయ్ రాజ్ మహవిష్ణు పాత్రలో టైటిల్ పాత్రని పోషిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నంది వెంకట్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. భక్తుడి పాత్రలో రంగాబాషా , లంకెల అశోక్ రెడ్డి ,పండ్రాల లక్ష్మీ , పరవాడ సత్యమోహన్, నిహారిక చౌదరి , తన్నీరు నాగేశ్వరరావు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. డ్రమ్స్ రాము సంగీతం అందించిన ఈచిత్రం ఆడియో, ప్రీ రిలీజ్ కార్యక్రమం హైద్రాబాద్ ఏ.వి కాలేజ్ లో ఘనంగా జరిగింది. సెప్టెంబర్ 23 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదలవుతున్న ఈ చిత్రం పంక్షన్ కి ఏవి కాలేజ్ ప్రిన్సిపల్ సిహెచ్ .రాజలింగం, ప్రముఖ నటులు కుప్పిలి శ్రీనివాస్ , గబ్బర్ సింగ్ సాయి , బుచ్చిరెడ్డి , వెంకన్న , బాస్కర్ యాదవ్ , కరాటే గ్రాండ్ మాస్టర్ ఆర్.కె.క్రిషేనా , ఎస్ .శ్రీనివాస్ ,సౌమ్య ,రామచంద్ర శ్రీనివాస్ కుమార్ పలువురు ప్రముఖులు పాల్గోని తెలుగు వెండితెరపై ‘;శ్రీరంగనాయక’ భక్తిరస చిత్రం అద్భుత విజయం సాదిస్తుందని అన్నారు.. ఈ సందర్బంగా …
శ్రీ మహవిష్ణు పాత్రదారి దుందిగల్ వినయ్ రాజ్ మాట్లాడుతూ : మా ‘శ్రీ రంగనాయక’లో శ్రీ మహావిష్ణు పాత్రలో నటించడం పూర్వజన్మ సుకృతం అన్నారు.. .దర్శకులు నంది వెంకట రెడ్డి అద్భుతంగా చిత్రీకరించారని తెలిపారు.. సెప్టెంబర్ 23 న థియేటర్ లలో విడుదల అవుతున్న ఈ చిత్రానికి ఘనవిజయం అందించాలని కోరారు.
భక్తుడి పాత్రధారి రంగాబాషా మాట్లాడుతూ : శ్రీ రంగనాయక చిత్రంలో భక్తుడి పాత్రలో నటించానని, ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు దన్యవాదాలు తెలిపారు..ఈ నెల 23 విడుదల అవుతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు
నటుడు లంకెల అశోక్ రెడ్డి మాట్లాడుతూ : శ్రీ రంగనాయక చిత్ర దర్శకులు వెంకట్ రెడ్డి గారు.. దుందిగల్ వినయ్ రాజ్ ని వెండితెరకు పరిచయం చేస్తున్నారు.. బిగ్ స్ర్కీన్ పై వినయ్ రాజ్ ని చూస్తుంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు దిగివచ్చినట్టు ఉందన్నారు.
అతిథి నటులు కుప్పిలి శ్రీనివాసరావు : శ్రీ రంగనాయక చిత్రంలో టైటిల్ రోలో పోషించిన దుందిగల్ వినయ్ రాజ్ పాత్రలో జీవించారని అన్నారు.. చిన్న సినిమా అనుకున్నాం కానీ.. స్క్రీన్ పై అవుట్ పుట్ చూశాక ఓ పెద్ద సినిమా ను చూస్తున్న ఫీలింగ్ కలిగిందని అన్నారు.. నిర్మాత రమావత్ మంగమ్మ కాంప్రమైజ్ కాకుండా నిర్మించినట్లు తెలుస్తోందని, ఈ నెల 23 రిలీజ్ అయ్యే ఈ సినిమా మంచి ఆదరణ పోందుతుందన్నారు. ఇతర నటీనటులకు, టెక్నిషియన్స్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
గబ్బర్ సింగ్ సాయి : శ్రీ రంగనాయక చిత్రంలో మహవిష్ణు పాత్రలో నటించిన వినయ్ రాజ్ ని స్ర్కీన్ పై చూస్తుంటే సాక్షత్తూ శ్రీ మహావిష్ణు ని చూసిన ఫీలింగ్ కలిగిందన్నారు.. సాంగ్స్ , ట్రైలర్స్ చాలా బాగున్నాయని …ఈ చిత్రం మంచి ఆదరణ పోందుతుందని అన్నారు.
వీరితో పాటు ఏవి కాలేజ్ ప్రిన్సిపల్ సిహెచ్ .రాజలింగం, బుచ్చిరెడ్డి , వెంకన్న , బాస్కర్ యాదవ్ , కరాటే గ్రాండ్ మాస్టర్ ఆర్.కె.క్రిషేనా , ఎస్ .శ్రీనివాస్ ,సౌమ్య ,రామచంద్ర శ్రీనివాస్ కుమార్ చిత్రయూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
నటీనటులు : దుందిగల్ వినయ్ రాజ్ ,రంగాబాషా , లంకెల అశోక్ రెడ్డి , పండ్రాల లక్ష్మీ , పరవాడ సత్యమోహన్ , నిహారిక చౌదరి , తన్నీరు నాగేశ్వరరావు , గుడ్డేటి ఆంజనేయులు , నరసింహా ,ఆనంద్ , మధుసూదన్ రెడ్డి లు నటించారు..
డైరెక్టర్ : నంది వెంకట్ రెడ్డి, నిర్మాత :రమావత్ మంగమ్మ, కథ : నర్ల రామకృష్ణ రెడ్డి, మ్యూజిక్ : డ్రమ్స్ రాము, కెమెరా : యాదగిరి
మాటలు : ముత్యాల గణేష్, ఎడిటింగ్ : ప్రవీణ్ కుమార్ , విజయ్ కుమార్, కోరియోగ్రఫి : ఆనంద్ మాస్టర్ , కృష్ణ మాస్టర్, పి.ఆర్.ఓ : దయ్యాల అశోక్