23 మంది డిబార్
సప్తగిరికాలనీ,కరీంనగర్ (జనంసాక్షి): జిల్లాలో గురువారం నిర్వహించిన ఓపెన్ ఇంటర్ పరీక్షలో మాస్‌కాపీయింగ్ పాల్పడుతూ 23 మంది డిబార్ అయనట్లు డీఈవో లింగయ్య తెలిపారు. కరీంనగర్ 6, హుజూరాబాద్‌లో 10, సిరిసిల్లలో 5, జగిత్యాలలో ఇద్దరు డిబార్ అయినట్లు పేర్కొన్నారు. జిల్లాం మొత్తంగా 21 కేంద్రాల్లో 4471 మంది విద్యార్థులకు గానూ 455 మంది గైర్హాజరయినట్లు తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన ఎస్సెస్సీ పరీక్షలు 16+ కేంద్రాల్లో 2,295 మంది విద్యార్థులకు గాను 226 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.