కస్తూర్బా పాఠశాల భవన నిర్మాణ పనుల పరిశీలన

జనంసాక్షి, రామగిరి : పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు సాహాకరంతో రామగిరి మండలంలో నూతనంగా నిర్మిస్తున్న కస్తూర్బా పాఠశాల నిర్మాణ పనులను రామగిరి జెడ్పిటిసి మ్యాదరవేణి శారద కుమార్ యాదవ్ బుధవారం పరిశీలించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పాఠశాల భవనంలో సౌకర్యాలు సరిగా లేక విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా జెడ్పీ చైర్మన్ సూచన మేరకు పాఠశాల నిర్మాణ పనులను పరిశీలన చేసి కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు. పాఠశాల భవన నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తిచేసి పాఠశాల భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శంకేషి రవీందర్ వైస్ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి, పన్నుర్ ఉప సర్పంచ్ దామెర శ్రీనివాస్ నాయకులు అల్లం తిరుపతి తదితరులు పాల్గొన్నారు