మల్కాపేట్ రిజర్వాయర్ కు “కర్రోళ్ల” పేరు పెట్టాలి

రాగుల రాములు మాల మహానాడు జాతీయ కార్యదర్శి.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 7.(జనంసాక్షి): మల్కాపేట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు మాజీ శాసనసభ్యులు కు. కర్రోళ్ల నర్సయ్య పేరు పెట్టాలని మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాగుల రాములు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధుడుగా తొలి శాసనసభ్యులుగా కర్రోళ్ల నరసయ్య అందించిన సేవలు మరువలేని వాని అన్నారు. మల్కాపేట్ బ్యాలెన్స్ రిజర్వాయర్ కు కర్రోళ్ళ నరసయ్య పేరు పెట్టాలని , సిరిసిల్లలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. మల్కాపేట్ రిజర్వాయర్ కు కర్రోల్ల నరసయ్య పేరు పెట్టడంతో పాటు సిరిసిల్లలో ఆయన విగ్రహం పెట్టేవరకు మాల మహానాడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. కార్యక్రమంలో పలువు నాయకులు పాల్గొన్నారు