ధర్మవరం గ్రామంలో వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 7 :
జోగులాంబ గద్వాల జిల్లా,ఇటిక్యాల మండలం ధర్మవరం గ్రామంలో గురువారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు గ్రామస్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి, నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మంద జగన్నాథం, అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జ్ మంద శ్రీనాథ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని గ్రామంలో శ్రీ కృష్ణకి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ రంగారెడ్డి, జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి, షేకపల్లి సర్పంచ్ రవీందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శేఖర్ గౌడ్, జగన్మోహన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, గోపాల్ రెడ్డి, గారు, నాగరాజు, సాయి బాబా, భరత్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.